Mana Telugu Bhaavalu
Thursday, 23 January 2014
ఎదురుచూపులెవరికోసమో
ఎదురుచూపులెవరికోసమో
కడుపునింపే దాత కోసమో
మమత పంచే మనసు కోసమో
కంటనీరు తుడిచే చెలిమి కోసమో
ఎదురుచూడకు చిట్టితల్లీ
జాలి లేని జీవులం మేము
మనుషులమని మరచేము
మనసులేని శిలలయ్యాము...suku
కాలం కదులుతున్నా
కాలం కదులుతున్నా
మాయదు గాయం
నిత్యం ఎదురీదుతున్నా
కానరాదు తీరం
ఎడారి దారిలో
పయనమైన వేళకి
కనిపించే నీళ్ళన్నీ
వట్టి ఎండమావులే..
ప్రశ్నల సుడిగుండంలో
చిక్కుకున్న మనసుకి
ఊరించే కలలన్నీ
వట్టి కలవరింతలే..
ఇకనైనా మేలుకోవే
ఓ చంచల మనసా
ఇక చాలు చాలించవే
నీ పిచ్చి వరస..!
-------------------- శ్రీ యస్వీ
Home
Subscribe to:
Comments (Atom)